ఎనుమరేషన్ బ్లాక్ లో ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీ గా చేపట్టాలి
– ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వెయ్యాలి.
– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ఎనుమరేషన్ బ్లాక్ లో ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలనీ, ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వెయ్యాలనీ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.శుక్రవారం నూగురు వెంకటాపురం మండలంలోని బొల్లారం, నూగురు, చొక్కాల గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 వ తేదీ నుండి చేపట్టే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లో భాగంగా హౌస్ లిస్టింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.అనంతరం ఏటూరు నాగారం మండలంలోని ముళ్ళకట్ట గ్రామంలోహౌస్ లిస్టింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లా లోని ప్రతి ఎనుమరేషన్ బ్లాక్ లో ఒక్క ఇల్లు కూడా వదిలివేయకుండ ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీగా చేప ట్టాలనీ, ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వేయాలని అధికారులను సూచించారు. హౌస్ లిస్టింగ్ చేయు సమయంలో ఇంటి యజ మాని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. మండల అభివృద్ధి అధికారులు, మండల తాహసిల్దార్లు, మండల పంచాయతీ అధికారులు, మండల ప్రత్యేక అధికా రులు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులతో, ఎనిమి రేటర్స్, సూపర్వైజర్లతో సమన్వయం చేసుకొని ఏ రోజు ఏ గ్రామం నందు, ఏ వార్డు నందు హౌస్ లిస్టింగ్ జరుగుతుందో దానికి సంబంధించిన వివరాలు ప్రజలందరికీ ముందస్తు గా తెలియచేయాలని సూచించారు. శనివారం, ఆదివారం రెండు రోజులు హౌస్ లిస్టింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ చేయడం, ప్రతి ఇంటికి సంబంధించిన వివరాలు తీసుకోవడం కొరకు ఎనుమరేటర్స్ ఇంటింటికి రావడం జరుగుతుందనీ, జిల్లా ప్రజలందరూ వారు వారి ఇంటి వద్ద ఉండాలని ఈ యొక్క సర్వేకు సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్ర మంలో తహసీల్దార్లు,అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.