ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలి
- జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
ములుగు ప్రతినిధి : ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ లో రిటర్నింగ్ ఆఫీసర్ ఐటీడీఏ పీ ఓ అంకిత్ తో కలిసి శాసన సభ ఎన్నికల నిర్వహణ పై పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజు ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ విధుల కోసం సిబ్బందిని నియమిస్తూ, ఎన్నికల విధుల పట్ల వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్స్, ర్యాంపులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల రోజు సిబ్బంది పోలింగ్ కేంద్రాలలో బస చేయుటకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేయలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డి ఎస్ వెంకన్న, ఆర్డిఓ కే సత్యపాల్ రెడ్డి, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, సీఈఓ ప్రసూనరాణి, డిపిఓ వెంకయ్య, కలెక్టరేట్ ఏవోప్రసాద్, ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం తహశీల్దార్ సంధ్యారాణి, ఏపీ డి, ఎంపీడీవోలు, ఎన్నికల సిబ్బంది విజయ్ కుమార్, అనిస్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.