దేశం ప్రజా పోరాట యోధుడిని కోల్పోయింది
– చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి సీతక్క
ములుగుప్రతినిధి : కామ్రేడ్ స్వర్గీయ సీతారాం ఏచూరి భార త రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. డిల్లీలో ఎయిమ్స్ హాస్పటల్ లో ఊపిరి తిత్తుల సమస్య తో వామ పక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడువగా శుక్రవారం ములుగులో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీ యాలపై చెరగని ముద్ర వేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని, ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పో వడం భాదకారం అన్నారు. పార్లమెంటులో ఎన్నో సమస్య లను ప్రజల కోసం చర్చించి, ప్రశ్నించిన మేటి నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. విలువలు, సిద్ధాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారం ఏచూరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్న మంత్రి సీతక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.