కారు దిగి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్సీలు
– సీఎం సమక్షంలో ఆరుగురు ఎమ్మెల్సీలు చేరిక
తెలంగాణ జ్యోతి , బ్యూరో : కారు దిగి హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు చేరడంతో టిఆర్ఎస్ క ఊహించని స్థాయిలో దెబ్బపడింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాసు మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు. చేరిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్, దండె విఠల్, ఎం.ఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ లు ఉన్నారు.