ఎల్ ఓ సీ మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
తెలంగాణ జ్యోతి, కాటా రం సబ్ డివిజన్ ప్రతినిధి (మహా ముత్తారం): తెలంగాణ రాష్ట్ర ఐటి& పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని మహ ముత్తారం మండలంలోని గండికామారం గ్రామానికి చెందిన గండి ప్రశాంత్ గారికి రూ.70 వేల ఎల్ ఓ సీ మంజూరు చేసి ఇప్పించారు. మంగళవారం మంథని నియోజకవర్గం లోని మహముత్తారం మండలం గండి కామారం గ్రామానికి చెందిన గండి ప్రశాంత్ కి వేరికోస్ వీన్స్ కి సంబంధించిన (70,000 ఎల్ ఓ సీ) నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సహాయం కొరకు మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు తెలుపగా వెంటనే ముఖ్య మంత్రి సహాయ నిది ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 70 వేల ఎల్ ఓ సీ మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు వారికి హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో అందచేశారు.