మున్నూరు కాపుల సమావేశాన్ని విజయవంతం చేయాలి
మున్నూరు కాపుల సమావేశాన్ని విజయవంతం చేయాలి
– జిల్లా కన్వీనర్ పిట్టల మధుసూదన్ పటేల్
ములుగు : జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధనకై జిల్లా గౌరవ అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నల్లెళ్ళ కుమారస్వామి గృహంలో సమావేశం నిర్వహిస్తు న్నట్లు మున్నూరు కాపు సంఘం జిల్లా కన్వీనర్ పిట్టల మధుసూదన్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షు లు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, ఎమ్డిఎఫ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల రవికుమార్ పటేల్, రాష్ట్ర యువత అధ్యక్షులు బండి సంజీవ్ పటేల్ లు పాల్గొంటా రన్నారు. ములుగు జిల్లా, మండల కమిటీ, జిల్లా కమిటీ మెంబర్స్, కుల బాంధవులు అందరూ పాల్గొనీ విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.