సీతక్క హామీ మేరకు ధర్నా విరమించిన మేడారం పూజారులు
సీతక్క హామీ మేరకు ధర్నా విరమించిన మేడారం పూజారులు
తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : తాడ్వాయి మండలం మేడారం గ్రామం సమ్మక్క-సారక్క ఆలయ ప్రధాన ద్వారం వద్ద బుధవారం మేడారం పూజారుల సంఘం ఆధ్వర్యంలో పూజారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా మంత్రి హామీతో విరమించారు. 1993 సంవత్స రంలో అప్పటి మత్స్య శాఖ మంత్రి పోరిక జగన్ నాయక్ మేడారం పూజారుల సంఘం అభ్యర్ధన మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మేడారం జాతర హుండీ లెక్కింపు, పూజారుల అతిథి గృహలు, కార్యలయాల కోసం వరంగల్ సెంట్రల్ జైల్ ఎదురుగా 1014 గజాల స్థలం కేటాయించినట్లు పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు తెలిపారు. భద్రకాళి దేవస్థానం ఈవో, ప్రధాన అర్చకులు వేద పాఠశాల నిర్వహణ పేరుతో గ్రౌండ్ ఫ్లోర్, 2 వ అంతస్తు, 4వ అంతస్తు కేటాయించాలని స్థానిక కమిషనర్, మినిస్టర్ ద్వారా ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. కాగా ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రీ సీతక్క కమిషన్ ఈ విషయం పై మాట్లడగా, అలాంటిది ఏమి లేదని, ఆరు నెలలు మాత్రమే పాఠశాల నిర్వహించు కుంటారని, అనంతరం వేరే చోట ఏర్పాటు చేసుకుంటున్న పాఠశాలలోకి వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారని అన్నారు. కాని వారు చెబుతున్నది ఒకటని, చేస్తున్నది ఒకటని, ధార్మిక భవనంలో తమ పేరుతో ఉన్న కార్యలయాన్ని మొత్తం కాళీ చేయాలని అధికారులు అంటున్నారని తెలిపారు. కాగా ఈ విషయమై దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని అందుకే సమస్య పరిష్కారం కోసం అలయ ప్రధాన ద్వారం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నామని తెలిపారు. కాగా వరంగల్ సెంట్రల్ జైల్ ఎదురుగా ఉన్న ధార్మిక భవనానికి మేడారం ధార్మిక భవనంగా పేరు మార్చాలని, అంతే కాకుండా ఈవో పరిధిలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పూజారు లు డిమాండ్ చేశారు.
మంత్రి హమీతో ధర్నా విరమించిన పూజారులు…
మేడారం ఆలయ ప్రాంగణం వద్ద పూజారులు ధర్నా నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి సీతక్క ధర్నా ప్రాంగణానికి చేరుకుని పూజారులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఈ విషయం ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, పూజారులకు న్యాయం జరిగేలా చూస్తానని, అంతే కాకుండా వచ్చే 7 రోజుల్లో సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా కృషి చేస్తానని, స్పష్టమైన హమీ ఇవ్వడంతో పూజారులు ధర్నా కార్యక్రమాన్ని విరమించారు.