సెర్ఫ్ విఒఎల సమస్యలు పరిస్కరించాలి.
– సంఘం రాష్ట్ర అధ్యక్షులు పనరాటి ప్రసాద్ డిమాండ్.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : సెర్ఫ్ పరిది లో పని చేస్తున్న విఓఏ ల సమస్యల పరిస్కారం కోసం ఉద్యమాలు చెయ్యా లని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విఒఎ ల సంఘ రాష్ట్ర అధ్యక్షు లు నరాటి ప్రసాద్ ప్రభుత్వం ని డిమాండ్ చేశారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపురం లో జరిగిన విఒఏ లు ఏఐటీయూసీ లో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెర్ఫ్ లో విఒఏ లు అతీతక్కువ వేతనం 5 వేలు ఇస్తూ వెట్టిచాకిరీ చేపిస్తారు . నిత్యం ఆన్ లైన్, అఫ్ లైన్ రికార్డ్. లోన్ రికవరీ. లోన్ మంజూరి, శ్రీనిధి, బ్యాంకు లింకేజీ. ఎంటర్ప్రైజెస్. తదితర రుణాలు అందించటం లాంటి అదనపు పనులు చేస్తూ ప్రజలకు లాభాలు అందిస్తున్న విఒఏ ల జీవితాలు అభివృద్ధి లేకుండా నష్టం పోతున్నారు అన్నారు. వారికి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి. ఇన్సూరెన్స్ 10 లక్షలు,. హెల్త్ కార్డు లు ఇవ్వాలని, పి.ఎఫ్. సాకర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డు. యూనిఫామ్ ఇవ్వాల ని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా సమావేశం లో ఏఐటీయూసీ లో 40 మంది చేరినట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు తోట మల్లికార్జు నరావు ,వేల్పుల మల్లికారజన్, కట్ల రాజు, కృష్ణ కుమారి,మీనా, సమ్మక్క, అనుమల సాయి, విఒఎ సంఘ మండల అధ్యక్షులు బోదేబోయిన శ్రీలత, పోలిన శ్రీలత, పండా సంధ్య, భాగ్యలక్ష్మి, అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.