Kaleshwaram | శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీ ఆదాయం 17 లక్షలు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం యొక్క హుండీలను ఈరోజు ఉదయం 10 .00 గంటల నుండి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. మహేష్ ఆధ్వర్యంలో డి. అనిల్ కుమార్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో విప్పి డబ్బులు లెక్కించడం జరిగినది. సదరు హుండీలలో 105 రోజులకు గాను 17,36,636/-రూపాయల ఆదాయం మరియు 3 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి,18 గ్రాముల మిశ్రమ బంగారం వచ్చినది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కే. రామ్ రెడ్డి, అడప సమ్మయ్య, కే. దేవేందర్, కుంభం పద్మ సర్పంచ్ వి.వసంత మరియు సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్. ప్రసాద్, దేవస్థానం సిబ్బంది, మరియు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి కామారెడ్డి సభ్యులు 139 మంది, శ్రీ ముక్తీశ్వర సేవా సమితి రాగినేడు సభ్యులు 13 మంది పాల్గొన్నారు. ASI.రాజేశం ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించినారు
1 thought on “Kaleshwaram | శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి హుండీ ఆదాయం 17 లక్షలు.”