అందాల పోటీలపై ఉన్న పట్టింపు అన్నదాతలపై లేదు

అందాల పోటీలపై ఉన్న పట్టింపు అన్నదాతలపై లేదు

అందాల పోటీలపై ఉన్న పట్టింపు అన్నదాతలపై లేదు

– ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి

– ములుగు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన మొక్క జొన్న రైతులు

– దొడ్డి దారిన బయటికి పోయిన కలెక్టరేట్ అధికారులు

– నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన రైతులు

– ప్రజా ప్రభుత్వం అంటే రైతులకు అన్యాయం చేయడమేనా

– భద్రాచలం ఎమ్మెల్యే రాజీనామా చేయాలనీ నినాదాలు చేసిన రైతులు

– వ్యవసాయ కమిషన్ రావాలని కోరిన రైతులు

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. సోమవారం వెంకటాపురం, వాజేడు  మండలాల బహుళ జాతి మొక్కజొన్న రైతులు ఆయా కంపెనీలు చేసిన మోసం కారణంగా రైతులు లక్షల్లో నష్టం జరిగిందని, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో 9 వందల మంది మొక్క జొన్న రైతులు ముట్టడి చేశారు. రైతుల సమస్యలను పట్టించు కోకుండా తప్పించుకోని తిరుగుతున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్ట ర్ తెల్లం వెంకటరావు తక్షణమే రాజీనామా చేయాలనీ రైతులు నినాదాలు చేశారు. ఏ.బీ.సీ.లు గా రైతులను విభజించడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని, రైతులు అందర్నీ ఒకే గ్రేడ్ లో ఉంచాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహామూర్తి అన్నారు. కంపెనీల నుండి వచ్చిన నష్టపరిహారం రైతులకు అందకుండా ఆర్గనైజర్లు అడ్డుకుంటున్నారని మండి పడ్డారు. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఆర్గనైజర్లు ఉండబట్టే రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నుండీ గుడవర్తి నర్సింహామూర్తి, మన్యం సురేష్, దనపనేని నాగరాజుని బహిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. అవినీతి పరులైన ఆర్గనైజర్లకు అండగా ఉండేది రాజకీయ పార్టీలే అన్నారు. ఈ నెల రెండో తారీఖున చెక్కులు పంపిణి చేస్తామని కలెక్టర్ దివాకర టి.ఎస్ రైతులకు హామీ ఇచ్చారని అన్నారు. రెండు రోజుల్లోనే అంతా తారు మారు అయిందన్నారు. ఆర్గనైజర్లకు అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రుల మద్దతు ఉండబట్టే రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. వ్యవసాయ కమిషన్ ని సైతం తప్పు త్రోవ పట్టిస్తూ ఉన్నారని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి రైతులకు వచ్చిన నష్టపరిహారం మొత్తం ఆర్గనైజర్లే కాజేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెబ్భై రోజుల నుండీ రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మౌనం ఖరీదు 9 వందల మంది మొక్కజొన్న రైతుల జీవితాలని తెలిపారు. ప్రభుత్వం అందాల పోటీకి ఇచ్చే ప్రాధాన్యత అన్నదాతలకు ఇవ్వడం లేదన్నారు. రైతులు ఆందోళన చేస్తూ ఉంటే అధికారులు పట్టించుకోలేదని అన్నారు. రైతులకు మనీ ల్యాండరింగ్ నోటీసులు ఇచ్చినప్పుడు రైతులకు పెట్టుబడి పెట్టలేదని కంపెనీ యాజమాన్యం, ఆర్గనైజర్లు వివరణ ఇచ్చినారని అన్నారు.ఆర్గనైజర్లు, కంపెనీ ఉద్యోగులు కలెక్టర్ కు తప్పుడు లెక్కలు చూపించి రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం దృష్టి సారించక పొతే 9 వందల మంది రైతులు తీవ్రంగా నష్ట పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి రాజ్ కుమార్ వచ్చి ఆందోళన కారులతో మాట్లాడి నిరసన విరమింప జేశారు. నాయకులు మహేష్, పాయం రాంబాబు, నాగుల ప్రవీణ్, ఈశ్వర్ వాజేడు,వెంకటాపురం మండలాల రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అందాల పోటీలపై ఉన్న పట్టింపు అన్నదాతలపై లేదు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment