డిపిఆర్వో తీరుపై సీనియర్ జర్నలిస్టుల అసహనం
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసినటువంటి మేడారం జాతర జర్నలిస్టుల కవరేజీ కృతజ్ఞత సభలో డిపిఆర్వో తీరుపై జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేశారు. మేడారం మహాజాతరపై గత రెండు నెలలుగా జాతర విశిష్టత పట్ల నిర్విరామంగా వార్తలు రాస్తూ, మంత్రుల పర్యటన ఉన్నప్పుడల్లా మేడారం వెళ్తూ వారి వార్తలను కవరేజ్ చేశారు. అక్కడ భోజనం ఉన్నా, లేకున్నా ఉన్న దానితో సరిపెట్టుకుంటూ వార్తలు సేకరించిన జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టులను జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి మంత్రి కృతజ్ఞత సభలో సీనియర్ జర్నలిస్ట్లు, వివిధ పత్రికల జిల్లా ప్రతినిధులను విస్మరించి పక్కజిల్లాలో పని చేస్తున్న టువంటి జర్నలిస్టులకు సన్మానం చేపించడం పట్ల సీనియర్ జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేశారు. డిపిఆర్వో తీరు సరికాదంటూ సభలోనే కొందరు జర్నలిస్టులు వారించ గా ఎస్పీ పిఆర్వో, మంత్రి పిఆర్వోలు వారి వద్దకు వచ్చి నచ్చజెప్పడంతో వారు శాంతించారు. ఇదే విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా విషయం తెలుసుకుంటానని ఇకపై ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా జిల్లా పాలనాధికారి స్పందించి జిల్లా పౌర సంబంధాల శాఖలో ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ములుగు జిల్లాలో పెత్తనం చేయడం, తను చెప్పినవిధంగా నడుచుకుంటున్న డిపిఆర్వోపై చర్యలు తీసుకుని జిల్లాలోని జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.