నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం
కాటారం, తెలంగాణ జ్యోతి : నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ద్యేయంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్థున్నట్లు భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, జాబ్ మేళా నిర్వహించే టాస్క్ కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఈ నెల 26 న నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పరిధిలో టాస్క్ కంపెనీ నిర్వహిస్తున్న జాబ్ మేళా లో ప్రముఖ కంపెనీలు పాల్గొంటు న్నట్లు తెలిపారు. 700 కంపెనీలు పాల్గొంటున్న ఈ జాబ్ మేళా లో 10 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ జాబ్ మేళా కార్యక్రమంపై గ్రామ గ్రామాన విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈనెల 26 వ తేదీన జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే జాబ్ మేళా కు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరవుతారని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ లో దరఖాస్తు ఉంటుందని విద్యార్హతలు ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. క్యూ ఆర్ కోడ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు 26వ తేదీన నిర్బహించే జాబ్ మేళా స్టాళ్లులో నమోదు చేసుకోవాలని తెలిపారు. 10 వతరగతి నుండి డిగ్రీలు, పిజీలు ఇతర పై చదువులు చదువుకున్న నిరుద్యోగ యువత కు గొప్ప అవకాశమని అన్నారు. మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ సమన్వయం తో అవగాహన కల్పించాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. మందులు, ఓ ఆర్ ఎస్ అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ : నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాబ్ మేళా కార్యక్రమంపై గ్రామ స్థాయిలో అధికారులు నిరుద్యోగ యువతను గుర్తించి వారి పూర్తి బయో డేటా నివేదిక తయారు చేయాలని తెలిపారు. అట్టి జాభితా మేరకు అర్హతలు బట్టి వారికి అవకాశాలు కల్పనకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ పై యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. క్యూ ఆర్ కోడ్ జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొనేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అదే రోజున నియమక ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు.
జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే : నిరుద్యోగ ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెడు వ్యసనాలకు బానిస కాకుండా యువత కు ఈ జాబ్ మేళా ద్వారా ఉపాధి లభిస్తుందని తెలిపారు. దూరం అని కాకుండా ఎక్కడ అవకాశం వస్తే ఆ జిల్లాకు వెళ్లాలని, నేను కలెక్టర్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామని అన్నారు. యువతి ,యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున జాబ్ మేళా పై ప్రచారం కల్పిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కేటీపీఎస్ సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, టాస్క్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.