ప్రభుత్వం ఆదివాసి ఎరుకలను గుర్తించాలి

ప్రభుత్వం ఆదివాసి ఎరుకలను గుర్తించాలి

ప్రభుత్వం ఆదివాసి ఎరుకలను గుర్తించాలి

-ఏకగ్రీవంగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ములుగు జిల్లా అధ్యక్షునిగా కేతిరి బిక్షపతి 

-తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు 

ములుగు, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వం ఆదివాసి ఎరుకల కులస్తులను గుర్తించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకి రాజు అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లోకిని రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఏర్పాటు చేయడం జరిగిం దని అన్నారు. ఈ సంఘానికి ములుగు జిల్లా అధ్యక్షుడిగా కేతిరి బిక్షపతి, ఉపాధ్యక్షులుగా పల్లకొండ భాస్కర్, మేడ బంగార య్య, సల్ల బాబు, ప్రధాన కార్యదర్శిగా పల్లకొండ ఎల్లస్వామి, కోశాధికారిగా పాలకుర్తి సురేష్, సహాయ కార్యదర్శులుగా జంగాలపల్లి రాజు ,దేవర్ల పరమేష్, కేతిరి అశోక్, దేవర్ల రాజు ,దేవర్ల సతీష్, పాలకుర్తి రాజు లను ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆదివాసి ఎరుకల కులస్తులను ఏకం చేసి వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులను వివరిస్తామని అన్నారు. ఇల్లు లేకుండా బ్రతుకుతున్న ఎరకల కులస్తులకు రాజీవ్ యువ వికాసం అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చేలా చూస్తామన్నారు. అనంతరం జిల్లా మహిళా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా మహిళ అధ్యక్షురాలు పాలకుర్తి ప్రమీల ,జిల్లా ప్రధాన కార్యదర్శి  కూరాకుల సరోజన, ఉపాధ్యక్షులు కూరాకుల సారమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి పద్మ ,జిల్లా కోశాధికారి సుల్తాన్ లావణ్య లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతిరి రాజ శేఖర్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం ,జిల్లా నాయకులు దుగ్యాల రాము, పులి చేరి సురేష్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ ,జిల్లా యూత్ కన్వీనర్ బిజిలి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment