పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలి.
పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలి.
– పెండింగ్ బిల్లులు అన్ని చెల్లించాలి.
– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : పెండింగ్లో ఉన్న నాలుగు డీ.ఎల ను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులు అన్ని వెంటనే చెల్లించాలని, నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని, ములుగు జిల్లా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిది గృహం ఆవరణలో చతుర్ద జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2024 ఫిబ్రవరి నెల నుండి జూన్ 29వ తేదీ వరకు జిల్లా చతుర్ద జిల్లా కార్యవర్గ సమావేశం లో జిల్లా జనరల్ సెక్రెటరీ బాసని రామమూర్తి నివేదిక సమర్పించారు. ఈ సమావేశానికి ములుగు జిల్లాలోని వివిధ మండలాల నుండి మరియు వెంకటాపురం, వాజేడు మండలాల నుండి పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు. ఫిబ్రవరి నుండి జూన్ వరకు చతుర్థి జిల్లా కార్యవర్గ సమావేశంలో, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాసర రామ్మూర్తి నివేదిక ప్రవేశపెట్టారు. నివేదికలో వివిధ అంశాలను సమావేశం చర్చించింది. సమావేశానికి ములుగు జిల్లా అధ్యక్షులు పాల్తియా సారయ్య అధ్యక్షత వహించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బి.ఆర్. భూషణం, రాష్ట్ర కార్యదర్శి ఏపీ విజయలక్ష్మి, వెంకటాపురం యూనియన్ అధ్యక్షులు కాల వ సుందర్ రావు, సంఘం బాధ్యులు సమావేశంలో పాల్గొన్నారు. నాలుగేళ్ల కాలంలో జరిగిన పెన్షనర్ల సంక్షేమ పథకాలు, డిమాండ్లు ప్రభుత్వ యొక్క ఆమోదాలు తదితర అంశాలపై కార్యదర్శి నివేదిక లో సమావేశంలో ప్రవేశపెట్టారు. సంఘం యొక్క మనుగడ, ఔన్నత్యము, శత శాతం సభ్యులను చేర్చుకోవడం, జనరల్ ఫండ్ తదితర అంశాలపై నివేదికలో పొందుపరిచారు. పెన్షనర్ మరణానంతరం వారి వారసులకు డెత్ జీవిత కాలపు బకాయిలు ఇప్పించాలని, కుటుంబ పెన్షన్ను బదిలీ చేయటం వంటి మౌలిక సేవలను క్షేత్రస్థాయిలో అందించినట్లయితే సంఘం ప్రతిష్టకు తోడ్పడుతుందని సమావేశంలో చర్చించారు. సంఘం పురోభివృద్ధికి జిల్లా సంఘం పక్షాన పెన్షనర్లు అందరూ సమిష్టిగా సహకరించి, సంఘం సభ్యులు అందరూ ఐక్యంగా ఉండి ,ప్రభుత్వ నుండి హక్కులు సాధించుకోవాలని సమావేశం తీర్మానించింది. పిఆర్సి రిపోర్టు తెప్పించి 1 జులై 2023 నుండి అమలు చేయాలని, సివిపి మొత్తాన్ని 150 వాయిదాలకు బదులు, 12 సంవత్సరాలకు తగ్గించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి, ఓపిఎస్ విధానం పునరుద్ధరించాలని తదితర ముఖ్యమైన తీర్మానాలను సమావేశం ఆమోదించి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమావేశంలో ములుగు జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పాల్ తీయ సారయ్య తీర్మానం ప్రవేశపెట్టగా సంఘం ప్రధాన కార్యదర్శి బాసని రామమూర్తి నివేదిక సమర్పణ తో సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తున్న డి. టి. ఓ. ములుగు, ఎస్. టి .ఓ ములుగు, డిడబ్ల్యుఓ ములుగు తదితర అధికారులకు సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యల పరిష్కారాన్ని పోరాట కార్యక్రమాలు చేపట్టుట యూనిటీ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, రాష్ట్రస్థాయిలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ములుగు జిల్లా సంఘం కార్యాలయభవన నిర్మాణానికి శంకుస్థాపన గావించి, పది లక్షల రూపాయలు భవన నిర్మాణం కు కేటాయించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి డాక్టర్ అనసూర్య సీతక్క కు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. అలాగే రాష్ట్ర సంఘం అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఏవి విజయలక్ష్మి, గౌరవ సభ్యులు కర్కారాం రెడ్డి, బి.ఆర్ భూషణం, విజయలక్ష్మి సంఘం పక్షాన గౌరవ సభ్యులకు సమావేశం కృతజ్ఞతలు తెలియజేసింది .భవన నిర్మాణానికి సాయి శక్తుల ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఈ సందర్భంగా సమావేశం కోరింది. సమావేశం తీర్మానాలను నూగూరు వెంకటాపురం యూనిట్ అధ్యక్షులు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం సీనియర్ నేత కాల్వ సుందర్రావు మీడియాకు విడుదల చేశారు.