రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఈ ప్రాంతానికి ఎంతో మేలు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
ఏటూరునాగారం ప్రతినిధి : ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరగనుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఏటూరు నాగారం మండలం ముళ్ళకట్టలో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న భూ సమస్యలు, రికార్డులు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ములుగు వెళ్లాల్సి ఉండేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటునాగారం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించడం వల్ల పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు వ్యయ ప్రాయాస తప్పుతుందన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న వారే లేరన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరు, మండలానికి రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల కరెంటు అందించడంతోపాటు రైతుబంధు రైతు బీమా పథకాల వల్ల తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు జరుగు తోందని ఆమె అన్నారు. గురువారం ఏటూర్ నాగారం మండలం ముళ్లకట్ట లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆమె ప్రసంగించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకునే కాంగ్రెస్ నేతలకు ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలన్నారు. ఒక్క అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని మరింత వేగంగా అభివృద్ధిని చూపిస్తానని ఆమె అన్నారు.
1 thought on “రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఈ ప్రాంతానికి ఎంతో మేలు”