అధికారుల పర్యవేక్షణ లోపంతో కుంటు పడుతున్న విద్యా వ్యవస్థ

Written by telangana jyothi

Published on:

అధికారుల పర్యవేక్షణ లోపంతో కుంటు పడుతున్న విద్యా వ్యవస్థ

– వెంకటాపురం మండలంలో రెగ్యులర్ ఎంఈఓని తక్షణమే నియమించాలి. 

– జిఎస్పి ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురంమండల కేంద్రం ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం ఆవరణ లో శుక్రవారం గొండ్వాన సంక్షేమ పరిషత్ సంఘ నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో  జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు పూనేం ప్రతాప్ అధ్యక్షత వహించారు. కార్యక్రమం లో ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ పాల్గొని మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతమైన వెంకటా పురం మండలంలో విద్యావ్యవస్థ కుంటుపడుతుందని ఆరోపించారు. మండలం లో ఎంఈఓ అధికారి లేక ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యవస్థ పర్య వేక్షణ లోపిస్తుందని ఆరోపించారు.అధికారుల పర్య వేక్షన లోపంతో పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా సమయ పాలన పాటించకుండా, ఇస్టారీతిన స్కూళ్లకు వెళ్తున్నారని, పర్యవేక్షించాల్సిన అధికా రులు లేక ఆదివాసి పిల్లలకు విద్య బోధన సరిగ్గా అందించ డంలో ఉపాధ్యాయులు విఫలం అవుతున్నారని ఆరోపించా రు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా లేక అంద రు ప్రైవేట్ విద్య సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.రెక్కాడితే కానీ డొక్కాడని ఆదివాసులకి ప్రైవేట్ స్కూళ్లలో చదివించ లేక అవస్థలు పడుతున్నారని అన్నారు.ఐ.టిడి.ఏ అధికారి కూడా గిరిజన ఆశ్రమ పాఠశా లలో పర్యవేక్షణ కరువైందని అన్నారు,ప్రభుత్వ ఆశ్రమ స్కూళ్లను నెలకు ఒక్కసారైనా విజిట్ చేయాలని, సమయ పాలన పాటించకుండా ఉపాధ్యాయులు వారి ఇష్టానుసారం గా నడుచుకుంటున్నారని ఆరోపించారు. స్కూళ్లలో ఉపాధ్యా యులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవా లని, తక్షణమే వెంకటాపురం మండలంలో రెగ్యులర్ ఎంఈఓ ని నియమించాలని డిమాండ్ చేశారు.లేని పక్షాన గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో, ఆదివాసి విద్యార్థులతో కలసి రాస్తారోకో నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు మేకల మహేష్, అట్టం మొహ న్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment