వరి పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లోని లక్ష్మీదేవి పేట గ్రామంలో మంగళవారం జిల్లా వ్యవ సాయ అధికారి సురేష్ కుమార్ వరి పంటలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఏఈఓ లను పంటల వివరాలను నమోదు చేశారని తెలుసుకున్నారు. వరి పంట లో అక్కడక్కడ ఉల్లికోడు వస్తుందని గొట్టం లాంటి పిలకలు మొదలు వద్ద ఏర్పడుతున్నాయని ఆకుల తాడుమలు వెండి రంగులోకి మారి కంకులు ఏర్పడవు, ఆకులు మాడిపోయి ఎదుగుదల మందగిస్తుంది అని అన్నారు. వాటి నివారణకు వరి పంట చుట్టూ కీటకాలను ఆకర్షించే పూల మొక్కలు నాటడం సేంద్రియ నియంత్రణగా చేయవచ్చు అని అన్నారు .క్లోరోపైరీఫాస్ 2.5 ఎం ఎల్ లేదా థయోమిథాక్సామ్ ను 0.3 -0.5 ఎం ఎల్ నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాడూరి శైలజ, విస్తీర్ణ అధికారులు డయానా, సునీ ల్,శ్రీనివాస్,మహి, పవన్, సాయికుమార్ రైతులు పాల్గొన్నారు