లక్ష్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు : మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ

లక్ష్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు : మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ

  • పార్టీ కోసం పని చేసిన గొప్ప నాయకుడిని కోల్పోయాం..

 మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : బీఆర్‌ఎస్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రైతు బంధు సమితి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న బండం లక్ష్మారెడ్డి అకాల మృతి పార్టీకి తీరని లోటని మంథని మున్సిపల్ ఛైర్పర్సన్  పుట్ట శైలజ అన్నారు. గురువారం రాత్రి లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి స్వగ్రామం మహదేవ్ పూర్ మండలం బొమ్మపూర్ ఆయన పార్థివ దేహన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. లక్ష్మారెడ్డిలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాయకుడు లక్ష్మారెడ్డి అని, అలాంటి నాయకుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.

మహాదేవపూర్ మండల ప్రతినిధి/ ఆరవెల్లి సంపత్ కుమార్.