ఇంటర్ ప్రవేశాలకు ఆగస్టు 20 వరకు గడువు పెంపు
ఇంటర్ ప్రవేశాలకు ఆగస్టు 20 వరకు గడువు పెంపు
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు మూడో విడత గడువు తేదీని, ఆగస్టు 20 తేది వరకు పెంచినట్లు వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల అకాడమిక్ ఇంచార్జ్ డా: అమ్మిన శ్రీనివాసరాజు మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. గతంలో జులై 31 చివరి తేదీగా ప్రకటించిన ఇంటర్ మీడియట్ బోర్డ్, విద్యార్థుల సౌకర్యార్థం ఈ తేదీని ఆగస్టు 20 వరకు పెంచినట్లు ఆయన తెలియజేశారు. ఈసదవకాశాన్ని విద్యార్థులందరూ వినియో గించుకొని ,ప్రభుత్వ కళాశాలలో చేరి ప్రామాణికమైన విద్యను పొందాలని కోరారు.