రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

కాటారం, తెలంగాణ జ్యోతి : భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారానే యువతకు భవిష్యత్తు ఉంటుందని భరోసా కల్పించండి ప్రజలందరిపై గురుతర బాధ్యత ఉండదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం కాటారం మండల పరిధిలోని ధన్వాడ, శంకరంపల్లి, రేగులగూడెం, దామెరకుంట, మద్దులపల్లి గ్రామలలో ఏఐసీసీ, టీపీసిసి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన తో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క సందేశం ప్రజలకు వివరిస్తూ గ్రామాల కూడలిలో ప్రజలం దరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పలువురు నాయ కులు మాట్లాడుతు మహాత్మాగాంధీ ,అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలని,ఈ మూడు సూత్రాల మీద దేశం మొత్తం మీద కార్యక్రమం జరుగుతోందని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసు కెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఓన్న వంశవర్ధన్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి గద్దె సమ్మిరెడ్డి, మాజీ సర్పంచ్ అంగజాల అశోక్, చీమల రాజు, కొట్టే ప్రభాకర్, రమేష్ ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, యూత్ కాంగ్రెస్ ,మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment