రైతుల డిమాండ్లు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉసురు పోసుకుంటుంది.

రైతుల డిమాండ్లు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉసురు పోసుకుంటుంది.

తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఎటూరునాగారం : రైతుల డిమాండ్లు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉసురు పోసు కుంటు, ములుగు జిల్లా రైతులను ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతుందో అర్థం కావడం లేదని ములుగు జిల్లా భారతీ య జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు లోడి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రైతుల కు ఎకరానికి 15వేలు జమ చేస్తామని, ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, వరి పంటకు 500 రూపాయల బోనస్ అందిస్తామని రైతు కూలీలకు కవులు రైతులకు 15వేల రూపాయలు నిధులు అందిస్తా మని పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇస్తామని మోసం చేసిందన్నారు. అకాల వర్షాలతో నష్టపో యిన రైతుల ఊసే లేదు.పంటలకు కరెంటు ఇవ్వక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అకాల వర్షాలతో అస్తవ్యస్తమైన రైతును పట్టించుకునే నాధుడే లేక, పంటలు ఎండిపోయి కొద్దో గొప్ప పండిన పంటలు అకాల వర్షాలకు రాళ్ల వానలకు రాలిపోయి రైతులు గోడున విలపిస్తు న్నారన్నారు. ఇలాంటి పరిస్థితి లో వదిలేసిన వారిని ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్కు లేదన్నారు. 6 గ్యారంటీలు అన్నారు, వాటి అమలు చేతగాక చేతులు ఎత్తేసారన్నారు. బీఆర్ఎస్ పాలన లో ప్రతి రెండు రోజులకు ముగ్గురు రైతులు ఆత్మ హత్య చేసుకుంటే కాంగ్రెస్ పాలనలో రోజుకు ఇద్దరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. అబద్దాలతో అధికారం. లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తోందని, అలాంటి కాంగ్రెస్కు ఈ పార్లమెంటు ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్పాలని వేడుకుంటున్నాననీ అన్నారు. కాంగ్రెస్ వచ్చినంక రైతులకు నిండా అప్పులు పెరుగుతూ, తిప్పలు తీరకుండా, ఆశలు ఆవిరైపోతు న్నాయ నీ,  కాంగ్రెస్ పుణ్యమా అని పొలాలకు నీళ్లు ఉండవు, తాగడా నికి నీళ్లు ఉండవు, ఊర్లలో కరెంటు ఉండదనీ, అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు పరిశీలించినట్టుగా ఈ కాంగ్రెస్ వంద రోజుల పాలన మళ్లీ గతంలోని 60, 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. కాంగ్రె స్ అంటే కరువు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు, కాంగ్రెస్ అంటే కడుపు కోతలు, కాంగ్రెస్ అంటే కష్టాలు, కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. కారు పోయి కాంగ్రెస్ వచ్చిందంటే రైతుల కష్టాలకు కన్నీళ్లు తోడైనట్లు ఉందన్నారు.  మార్పు మార్పు అన్నారు, మార్పు అంటే రైతులు మరణిస్తున్న రైతుల రుణాలు మాఫీ చేయకపోవడమేనా? రైతుల కష్టాలు, కన్నీళ్లు పట్టించుకోక పోవడమేనా మార్పు అని ప్రశ్నించారు. పొలాలు ఎండు తున్న, రైతుల కడుపులు మండుతున్న, ఈ మంటలే కాంగ్రెస్ ను దహించి వేస్తాయన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరానికి 6 వేల రూపాయల నగదు అందిస్తు, రైతులకు ఒక ఎకరానికి ఎరువుల సబ్సిడీ ద్వారా 30 వేల రూపాయల అందిస్తున్నారన్నారు. సీజన్కు ముందే రైతులకు లైన్లో నిల బడకుండా విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నారనీ,  రైతులు ఆరుకాలం పండించిన పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన ద్వారా పంట నష్టపరిహారం అందిస్తున్నారన్నారు. రైతుల అన్ని పంటలకు మద్దతు ధర గణనీయంగా పెంచిన ఒక పటిష్టమైన మోదీ లాంటి నాయకత్వం అవసరం కాబట్టి రైతులు మోడీకి మద్దతు తెలిపి ఈ పార్లమెంటు ఎలక్షన్లలో బిజెపిని గెలిపించాలని కోరారు. పార్లమెంటు నియోజకవర్గం వారిగా మళ్లీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందని, అలాంటి కాంగ్రెస్కు ఓటు వేసి మన నాశనాన్ని మనమే కోరుకుందామా అది ప్రశ్నించారు.  ములుగు జిల్లా వాసులు ఇప్పటికే మూడుసార్లు అన్ని డాక్యుమెంట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. మరొకసారి ఇక్కడి వాసులు ఇబ్బంది పడకూడదంటే ములుగును రద్దు చేయమని చెప్పలేకపోతున్నా ములుగు జిల్లా ఇన్చార్జి మంత్రి గా ఉన్న సీతక్క కూడా ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని జిల్లా వాసులను కోరారు.