వానకాలం రైతు భరోసా ఎగ్గొటిన కాంగ్రెస్ సర్కార్

వానకాలం రైతు భరోసా ఎగ్గొటిన కాంగ్రెస్ సర్కార్

– మండల కేంద్రంలో నల్లబ్యాడ్జీలతో నిరసన…

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: వానకాలం రైతు భరో సా ఎగ్గొటిన కాంగ్రెస్ సర్కార్ చర్యకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలో నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపుమేరకు,ములుగు జిల్లా బిఅరెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు… కన్నాయిగూడెం మండలంలోని బిఅరెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బల సమ్మయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రధానరహదరిపై నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు సుబ్బల సమ్మయ్య మాట్లా డుతు…. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎన్నిక లకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతు భరోసా డబ్బులను ఎకరాకు 7500/- రూ “ల చొప్పున తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి రైతుకు వెంటనే వేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. అలాగే రెండు లక్షల పైన ఉన్న రైతులకు వెంటనే రైతు ఋణ మాఫీ చేయాలనీ తెలిపారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వం పై రాస్తారోకోలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా సీని యర్ నాయకుడు చిన్ని కృష్ణ మాట్లాడుతూ… రైతులకు ఇచ్చి న హామీలను తుంగలో తొక్కి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షా త్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలా అనడం సరికాదని, రైతుబంధును పూర్తి గా ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ కొత్త గైడ్ లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు చేస్తున్న అన్యాయన్ని ఎట్టి పరిస్థితుల్లో బిఅరెస్ పార్టీ సహించేది లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతోందని ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని తెలిపారు. వానకాలం రైతు భరోసాను ఎగొట్టి రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టాడని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతుల ఉసురు తగులుతుందని శాపనా ర్థాలు పెట్టారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీ మాటలు నీటి మూట లేనన్నారు, ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటి కైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేష్, కిషోర్, రాంబాబు, సోషల్ మీడియా ఇంచార్జి రాజేష్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.