గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం
– వెంకటాపూర్ స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ రవీందర్ రెడ్డి
వెంకటాపూర్: మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం పనులను వెంకటాపూర్ స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ రవీందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలలో వాటర్ ట్యాంకులు, చుట్టూ పరిస రాల పరిశుభ్రత, గ్రామపంచాయతీ చేపడుతున్న పనులను గ్రామంలో చేపడుతున్న పనులపై రికార్డును పరిశీలించారు .వెంకటాపూర్ మండలంలో 10 గ్రామపంచాయతీలో కమ్యూ నిటీ సోఫిట్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, మురుగు కాలువలు గ్రామంలో కొనసాగుతున్న స్వచ్ఛతను పచ్చదనం పనులను పరిశీలించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శులు, కారోబర్లు ,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.