రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : పోలీస్ అమ రవీరుల సంస్కరణ దినోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం నిర్వహించే రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి చిడెం సాయి ప్రకాశ్ కోరారు. ఉదయం 10 గంటల నుండి రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు, రక్త దానం చేయదలచుకున్న వారు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ కే. తిరుపతిరావు, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి చిడెం సాయి ప్రకాశ్ 8985394546, పోలీస్ అధికారుల నంబర్లలో సంప్రదించా లని కోరారు.