కేంద్రంలోని బిజెపి సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి

కేంద్రంలోని బిజెపి సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి

కేంద్రంలోని బిజెపి సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి

– కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచ రెడ్డి చరణ్

నిజామాబాద్, తెలంగాణ జ్యోతి :మహాత్మాగాంధీ, అంబేద్కర్ ల సిద్ధాంతాలతో కేంద్రంలోని బిజెపి సర్కార్ పాలనకు చరమ గీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచ రెడ్డి చరణ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జాతీయ కాంగ్రెస్ పిలుపుమేరకు ఆర్మూర్ నియోజకవర్గం లోని డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తొండాకూర్,దత్తాపూర్, మారంపల్లి,గంగ సాగరం గ్రామాలలో పాదయాత్రలో డొంకేశ్వర్ మండల ఇంచార్జ్ పంచరెడ్డి చరణ్ సమక్షంలో పాదయాత్ర నిర్వహించారు. ముందుగా తొండాకూర్, దత్తాపూర్, మారంపల్లి, గంగాసాగరం గ్రామాలలో పాదయాత్ర నిర్వహించి ఆయా గ్రామాల లోని మహాత్మా గాంధీ , అంబేద్కర్ విగ్రహాలతో పాటు మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించి ఆయా గ్రామాలను కాంగ్రెస్ జెండా ను ఆవిష్కరించిన అనంతరం ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో కార్యకర్తలతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచ రెడ్డి చరణ్ మాట్లాడుతూ జై భీమ్ జై బాబు జై సంవిధాన్ యొక్క ముఖ్య ఉద్దేశం గాంధీ, అంబేద్కర్ ఆలోచనలు ఆశయా లను ప్రతి గ్రామంలో గడపగడపకు తీసుకువెళ్లి దేశానికి అంబేద్కర్ ఆర్థిక, రాజకీయ, సమానత్వ లక్ష్యాలను గుర్తు చేయడంతో పాటు గాంధీ జి చెప్పిన సత్యం, అహింస, పరమత సహనం లాంటి సిద్ధాంతాలను ప్రజలకు చెప్పి గాంధీ అంబేద్కర్ పై బిజెపి, ఆర్ఎస్ఎస్ సంఘపరివార్ లాంటి మతతత్వ సంస్థ లు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పి కొట్టడం కోసమని ఆయన అన్నారు. దేశంలో పలు రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులు అధికా రంలో ఉండడం చూసి ఓర్వలేక ఆయా రాష్ట్రాలకు నిధులు నిలిపివేసి బిజెపి పాలిత రాష్ట్రాలలో భారీగా నిధులు కేటాయిం చిందని, ఇది పూర్తిగా ఫెడరల్ వ్యవస్థ వ్యతిరేకమని, రాజ్యాంగా నికి తూట్లు పొడుస్తూ అటు ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేయడంతో పాటు రాజ్యాంగ వ్యతిరేకంగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలను అవినీతి సొమ్ము ఉపయోగించి ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొడుతున్న నీచ చరిత్ర బిజెపిని ఆయన మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్ర విద్యా సంస్థలను క్షీణింప చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని,అందులో భాగంగా నే కేంద్ర విద్యను కాషాయీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుం దని ఆయన అన్నారు. బిజెపి హయాంలో పేదవాడు మరింత పేదవాడిగా ధనికుడు మరింత ధనవంతుడిగా ఎదిగాడని, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి పేదల సంపద మొత్తాన్ని కార్పొరేట్లకు ధారా దత్తం చేసింది కేంద్రంలోని బిజెపి సర్కార్ అని ఆయన అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలకు పెరిగి పోవడానికి కారణం బిజెపి అవలంబించిన కార్పొరేట్ పక్షపాత వైఖరి మాత్రమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, దత్తాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన్న, మారంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమన్,గంగాధర్, గంగారెడ్డి,స్రవంతి, బొజాగౌడ్, సురేందర్, ఫరీద్ లతో పాటు ముఖ్య కాంగ్రెస్ నాయ కులతో పాటు యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment