పెద్దపల్లిలో బిజెపి జెండా ఎగరడం ఖాయం
తెలంగాణ జ్యోతి, కాటారం : పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని కాటారం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుం టున్నారని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బల పరుస్తూ పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి గంట అంకయ్య, కార్యదర్శి వేముల లింగయ్య, నాయకులు గంట రామచంద్రం, తోకల బాలయ్య తదితరులు కోరారు.