అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రుల ప్రారంభం
– ఊరేగింపులతో అమ్మవారి విగ్రహాలు మండపంలో ప్రతిష్ట
– తరలివచ్చిన భక్తజనం
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి: దసరా పండు గ సందర్భంగా శరన్నవరాత్రులు గురువారం అంగరంగ వైభ వంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ములుగు జిల్లా వెంక టాపురం, వాజేడు మండలాల్లో అనేక గ్రామాల్లో శ్రీ కనక దుర్గమ్మ తల్లి దేవీ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహా లను కొనుగోలు చేసి రెండు రోజులు ముందుగానే ఆయా గ్రామాల్లోని దేవాలయాలు, మందిరాలలో ఉంచి, గురువారం ఉదయం మేళతాలాలతో భక్తులు స్వాగత సన్నహాలతో వాహనాలపై శ్రీ కనకదుర్గమ్మ తల్లి విగ్రహాన్ని తోడ్కెని వచ్చి, అత్యంత భక్తి శ్రద్ధలతో మండపాలలో ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, పురోహితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనేక గ్రామాల్లో దేవీ నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభం కావడంతో, ఉదయం సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలు, అమ్మవారి ఇష్ట పూర్వక ప్రసాదాల పంపిణీ, తదితర భక్తిరస కార్యక్రమాలతో గ్రామాల్లో హోరెత్తించింది. వెంకటాపురం పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేప చెట్టు సెంటర్ తోపాటు, అనేక వీధులలో నవరాత్రి మహోత్సవాల కమిటీలు శరన్న వరాత్రుల ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.