ఇల్లందులో విలేఖరిపై దాడి అమానుషం
– టీయూడబ్ల్యూజె జిల్లా కోశాధికారి కుమార్ యాదవ్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గురువారం రాత్రి విలేఖరి నిట్టా సుదర్శన్ పై దుండగులు మారణాయధాలతో దాడి చేయడం అమానుష మని, అట్టి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా టియుడబ్ల్యూజె (ఐజేయు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోశాధికారి చింత ల కుమార్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుదర్శన్ పై దాడిని నిరసిస్తూ, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకో వాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల తీసుకోచ్జిన పలు చట్టాలను ఇలాంటి ఘటనలు చోటుచేసు కున్నప్పుడు అమలు చేయాలని కోరారు.