రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం
– మహిళా,శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం : మంగపేట మండలం లోని బ్రహ్మణపల్లి చెక్ పోస్ట్ నుండి ఏటూరునాగారం వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర పంచా యితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు,కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇన్ని రోజులు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకొచ్చామని, ఇంకొక ఐదు రోజులు కష్టపడి పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా కష్టపడాలని,కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీతక్క గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని నిలపాలని కోరారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలం దరూ పనిచేయాలని కోరారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా పేరొందిన సీతక్క గౌరవాన్ని నిలిపితే రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అన్ని రకాలుగా తోడుంటా మని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని,కేంద్రంలో కూడా అధికారం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదల పక్షాన నిలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, నరేంద్ర మోడీ ఏ చట్టాలు తీసుకచ్చిన వాటికి మద్దతు తెలిపింది. బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కాదా ఒక్కసారి ప్రజలు ఆలోచించండి అని, కెసిఆర్ 10 యేండ్ల లో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ లక్షల కోట్లు అప్పు చేశాడు అని ప్రభుత్వ రంగ సంస్థలని తన స్వలాభం కోసం ఆయన మిత్రులకు కట్టబెట్టి పేదల నడ్డి విరిచారని,కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండు కొవాలని బిజెపి చూస్తుందని ప్రజలందరూ బిజెపి ఎత్తుగడలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మహిళలు, యువకులు, శ్రామికులు, రైతులతో పాటు ప్రతీ ఒక్కరికి సమన్యాయం అందించాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యం అని, బలరాం నాయక్ ను అధిక మెజారిటీ తో గెలిపించాలని,నేను మీకు అండగా ఉంటాను అని అన్నారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజలకు న్యాయం జరుగు తుందని, అసెంబ్లీ ఎన్నికలలో 6గ్యారంటీలు ఇచ్చామని,ఇప్ప టికే 5గ్యారంటీలను అమలు చేశాం అని రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం అని అన్నారు. అధికారంలోకి వచ్చి న వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కృషి చేస్తామని అన్నారు. మన ప్రాంత బిడ్డ గతములో కేంద్ర మంత్రి గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన మహబూ బాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు.ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఎటురునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న, ఎటురునాగారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటమట రఘు,కన్నాయి గూడెం మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు ఆయుబ్,ఖలీల్,చిన్న ఎల్లయ్య,రంజిత్,కిషోర్, మధుకర్,గోపాల్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.