TG TET | జనవరి ఫస్ట్ నుంచి టెట్..!
TG TET | జనవరి ఫస్ట్ నుంచి టెట్..!
– నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
– జనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్
– నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ షురూ
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది.వచ్చే ఏడాది జనవరి1 నుంచి 20 వరకు ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని సర్కారు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులిటెన్తో పాటు డిటెయిల్డ్ నోటిఫికేషన్ను మంగళవారం వెబ్ సైట్లో https://schooledu.telangana.gov.in/ISMS పెడ్తామని వెల్లడించారు. మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది రెండోసారి టెట్ నిర్వహిస్తోంది. ఇదే సంవత్సరంలో మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించింది. తాజాగా మళ్లీ రెండోసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణలో ఒకే సంవత్సరం రెండు నోటిఫికేషన్లు రావడం ఇదే తొలిసారి. ప్రత్యేక రాష్ట్రంలో 2016 మే నెలలో, 2017 జులైలో, 2022లో జూన్లో, 2023 సెప్టెంబర్లో, 2024 మే నెలలో టెట్ పరీక్షలు నిర్వహించారు. ఇది తెలంగాణలో నిర్వహి స్తున్న ఆరో టెట్. అయితే, గతంలో టెట్-2024లో క్వాలిఫై కాని వారికి వచ్చే టెట్ లోఉచితంగా అప్లై చేసుకునే వెసులు బాటు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఫీజులు, పరీక్షల తేదీలు, ఇతర పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ మంగళవారం అధికారులు విడుదల చేయనున్నారు. కాగా, మే నెలలో జరిగిన టెట్ పేపర్ 1లో 67.13% మంది, పేపర్ 2లో 34.12% మంది క్వాలిఫై అయ్యారు.