రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థినికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థినికి తీవ్ర గాయాలు

కాటారం, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోఈరోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి అక్షయ టెన్త్ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రం కాటారంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తోంది. తోటపల్లి అక్షయ సోదరులు రాజేశ్, తరుణ్‌తో కలిసి మోటార్ సైకిల్ మీద ముగ్గురు పరీక్షా కేంద్రంనకు వెళ్తుండగా 353 సి జాతీయ రహదారిపై బయ్యారం ఎక్స్ రోడ్ వద్ద అదుపుతప్పి కల్వర్టు ను మోటార్ సైకిల్ ఢీకొన్నది. ఈ ఘటన‌లో పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థిని తోటపల్లి అక్షయ కు తీవ్ర గాయాలయ్యాయి. కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. చికిత్స కోసం భూపాలపల్లిలో వంద పడకల ఆసుపత్రికి తరలిం చారు. బైక్ నడుపుతున్న రాజేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన అక్షయ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.