శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవానికి సిద్దమైన ఆలయ ప్రాంగణం

శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవానికి సిద్దమైన ఆలయ ప్రాంగణం
– ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సౌకర్యార్థం అంగరంగ వైభవంగా అలంకరించి సిద్ధం చేశారు. అధ్యాయనోత్సవంతో మంగళవారం నుండి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యా యి. ప్రతిఏట జరిగే మహోత్సవానికి వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు చుట్టుపక్కల మండలాల నుండి సరిహద్దులోని చత్తీస్గడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి పదివేల మందికి పైగా భక్తులు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాలు తిలకించేందుకు ప్రతి ఏటా వస్తున్నారు. 12వ తేదీ బుధవారం అంకురార్పణ, 13వ తేదీ ధ్వజారోహణ, రాత్రి ఎదురుకోలు సన్నాహాలు, 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు దేవాదాయశాఖ కార్యనిర్వహ ణ అధికారి, కమిటి పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఏర్పాట్లు నిర్వహించింది. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో సు వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ,కనులారా వీక్షించేందుకు చలువ పందిళ్లు వేసి విస్తృత ఏర్పాట్లు నిర్వహించారు. కల్యాణ మండపం, స్వామివారి ఆలయం, పందిళ్ళు అనుబంధ దేవాలయాలు రంగులతో, సున్నాలతో అందంగా అలంకరించారు. ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించడంతో వెంకటాపురం పట్టణానికి నూతన శోభను సంతరించుకుంది. భద్రాచలం ఆర్టీసీ డిపో కళ్యాణం సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించనున్నట్లు సమాచారం.