తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం 

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం 

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం 

తెలంగాణ జ్యోతి,  ఏటూరునాగారం : మండల కేంద్రం లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బి ఆర్ ఎస్  పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజాపాషా అధ్యక్షతన పాలాభిషేకం కార్య క్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకు లు తుమ్మ మల్లారెడ్డి, నూతి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీ లైన ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి నాలుగు కోట్ల తెలం గాణ ప్రజల ఆంక్షలకు విరుద్ధమైన పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు 2007 లో తెలం గాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్, కెసిఆర్ లు మేధావులతో చర్చించి రూపకల్పన చేసినటు వంటి తెలంగాణ తల్లి ఆ విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో కూడిన తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసి దీనినే తెలంగాణ తల్లి అని అనాలని లేదంటే ప్రజలను జైలుకు పంపిస్తానని తుగ్లక్ మాటలు మాట్లాడుతున్నాడ న్నారు. ఇలాంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రానికి కాదు చివరికి కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి తన పద్ధతులు మార్చుకోవాలని వారు హెచ్చరించారు. ఎన్నికల హామీలలో మీరు చెప్పినటువంటి హామీలు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, పేదలకు ఇస్తానని చెప్పిన ఇల్లు,మహిళలకు గృహలక్ష్మి కింద ఇస్తానని చెప్పిన 2500 రూపాయలు, స్కూటీలు, రైతు భరోసా,పెన్షన్లు డబుల్ బెడ్ రూం పథకా లను అమలు చేస్తాం అని చెప్పిన వాగ్దానాలకు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ మాట దాటేయడం సరికాదన్నారు. ఎన్ని కల హామీలలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తానని గాని, మూసి ప్రక్షాళన చేస్తానని గాని, పేదల ఇల్లు కూలుస్తానని గాని, ఏ ఎన్నికల సభలోనైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సప్పిడి రామ్ నరస య్య, తాడూరి రఘు, కుమ్మరి చంద్రబాబు, గండేపల్లి నరస య్య,కాళ్ల రామకృష్ణ, ఖలీల్, ఈసం స్వరూప, లొట్టా పెట్టెల రాజేష్, కాత యాదగిరి, వావిలాల రాంబాబు, వావిలాల ముత్తయ్య, బట్టు రమేష్, చిప్ప నాగరాజు, మందపల్లి చంద్రం, వావిలాల కిషోర్, దడిగల లక్ష్మణ్, నార ప్రశాంత్, మాదరి రాంబాబు, పాలకుర్తి విజయ్, తాళ్ల పెళ్లి మోహన్, మెరుగు రఘు, గడ్డం ప్రసాద్, తాళ్ల పెళ్లి కుమార్, ఎండి షఫీ, జాడి హరిబాబు, మామిడి కొమరయ్య, సైరాని బాబా, నరేష్, జూపాక నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment