Telangana : ఆగస్టు 15లోగా రుణమాఫీ సాధ్యమేనా..?
డెస్క్ : లోక్ సభ ఎన్నికల వేళ రైతు రుణమాఫీపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారు. రుణమాఫీ అమలు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అమలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. సదరు కార్పొరేషన్ కు రెగ్యూలర్ గా వచ్చే ఆదాయ మార్గాలను బ్యాంకులకు చూపించడంతో పాటు బాండ్స్ రూపంలో గానీ, ఇతర మార్గాల్లో గానీ ప్రభుత్వం ష్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబు తున్నారు. తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఏం జరుగు తుందో వేచి చూడాల్సిందే ఇక…