ప్రభుత్వ జూనియర్ కళాశాల కరపత్రం ఆవిష్కరించిన తహసిల్దార్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విధి విధానాలకు సంబంధించిన కరపత్రాన్ని స్థానిక తహసిల్దార్ డి. వీరభద్ర ప్రసాద్ శనివారం వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. కళాశాల మంజూరు కొరకు 40 సంవత్సరాల కృషి ఫలితంగా ఏర్పాటైన,ఈ ప్రభుత్వ కళాశాలను అడ్మిషన్లతో పరి రక్షించుకోవాల్సిన బాధ్యత మండలంలోని ప్రతి ఒక్కరిది అని ఆయన అన్నారు, కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను,సౌకర్యాలు ను తమ పరిధిలో అందించడానికి ,ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తహసిల్దార్ వీరభద్ర ప్రసాద్ హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ ఇంచార్జ్ డా: అమ్మిన శ్రీనివాస రాజు, నాయిబ్ తాసిల్దార్ యం. మహేందర్, సీనియర్ అసిస్టెంట్ యం.జ. సమ్మయ్య, గిర్ దావర్ మల్లయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అచ్చా నాగేశ్వరరావు, సిబ్బంది తదితరులు కరపత్రం ఆవిష్కర ణ కార్యక్రమంలో పాల్గొన్నారు.