మిర్చి రైతు కంట కన్నీరు.

Written by telangana jyothi

Published on:

మిర్చి రైతు కంట కన్నీరు.

– నల్లి, బిల్ట్ తెగులుతో మిర్చి తోటలకు తీవ్ర నష్టం. 

– దిగుబడులు లేక దిగాలు పడుతున్న మిర్చి రైతన్నలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాలలో ప్రధాన వాణిజ్య పంట అయినా మిర్చి తోటలకు విల్ట్ అనే తెగుళ్ళు సోకటంతో పూత పిందె కాపు దశలో ఉన్న మిర్చి తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దానికి తోడు నల్లి ,ఆకు ముడత తెగుళ్ళు కారణంగా ఎన్ని రకాల మందులు పిచికారి చేసిన తగ్గక పోవటంతో వేలాది ఎకరాల్లో సాగుచేసిన మిర్చి తోటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఏడాది మిర్చి పంటకు ఆశాజనకంగా రేట్లు ఉండటంతో ఈ ఏడాది వెంకటాపురం మండలంలో 12,500 ఎకరాలు, వాజేడు మండలంలో 11 వేల ఎకరాలకు పైగా మిర్చి తోటలు సాగు చేశారు.ఎకరానికి 1.50 లక్షల నుండి 2 లక్షల రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మిర్చిపంటలకు , విల్ట్ ,నల్లి ఆశించటం తో నిలువెల్లా పచ్చని మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో ఎండిపోతున్న మొక్కలు తోటను చూసి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వ్యవసాయ పరిశోధన శాలలో విల్ట్ వేరుకుళ్ళు తెగుళ్ళుకు ఇంతవరకు మందులు కనిపెట్టలేదని, వాళ్లు ,వీళ్లు చెప్పిన మందులు పిచికారి చేసి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు అధిక పెట్టుబడులతో రకరకాల తెగులు నివారణ మందులు పిచికారి చేశారు. అయితే నల్లి ముడత అనే తెగులు ఆశించడంతో పూత పిందె దశలో తెగుళ్ళు తో కాపు దశ స్తంభించి పోయింది. దీంతో ముందుగా కాసిన కాయలు మాత్రమే మిరప పండు దశకు రావడంతో, రైతులు ఉన్న పండు కాయలను కోతలు కోసి కళ్ళాల్లో ఆరబెడుతున్నారు. విల్ట్ , మరియు నల్లి తెగులు కారణంగా ఎకరానికి పదిక్వీంటాలు కూడా దిగుబడి రావట్లేదని, దీంతో ఎకరానికి లక్ష రూపాయలు పైగా నష్టపోయే అవకాశం ఉందని మిర్చి కన్నీరుతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి తోటలకు తెగుళ్ల బెడద ఒకపక్క కొనసాగుతుండగా, మరోపక్క మార్కెట్లలో ధరలు గణనీయంగా తగ్గిపోతూ, కొద్ది కొద్దిగా పెరుగుతూ, ధరలు దోబూసులు ఆడుతు న్నాయి.ధర తగ్గుతూ రైతులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. అధిక ధరలతో మిర్చి విత్తనాలు కొనుక్కొని, నారు పెంచి ఎకరం 40,000 రూపాయలు కౌలు చెల్లించి, మల్షీంగ్ సీటు , బిందు సేద్యంతో రైతాంగం సాగు చేస్తున్నారు. విల్ట్ తెగులుతో నిలువునా చనిపోయిన తోటలు ను రైతులు పీకి వేసి బయటపడేస్తున్నారు. మిగిలిన కొద్దో గొప్ప తోటలకు నల్లి పేను సోకటంతో ఆకులు ముడుచుకొని పూత పిందె స్తంభించుకోవడంతో, ఉన్న కాయలు పళ్ళు పండిన తర్వాత కోతలు కోసుకొని కళ్ళాల్లో ఆరబెట్టుకుంటున్నారు. దీంతో మిర్చి వ్యవసాయం రైతుల పాలిట తెగుళ్లు శాపంగా మారాయి. ఎరువులు పురుగుమందు ధరలు, కూలీల రేట్లు పెరిగిపోవడంతో, రైతులు దిక్కు దోచని స్థితిలో ఉన్న, ఉన్న మిరప పళ్ళు మాత్రమే కూలీలతో కోస్తున్నారు. పంట చేతికి రాక అప్పులు ఎలా తిరతాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మిర్చి ఆయకట్టులపై సర్వే నిర్వహించి, తెగుళ్ళ బారిన పడి నష్టపోయిన రైతాంగానికి నష్టపరహారం చెల్లించి,మిర్చి రైతులు ఆత్మహత్య లు చేసు కోకుండా కాపాడాలని వెంకటాపురం, వాజేడు మండలాల రైతాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పత్రికా ముఖం గా విజ్ఞప్తి చేస్తున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now