విద్యార్థులను కూలీలుగా మార్చేసిన ఉపాధ్యాయులు

Written by telangana jyothi

Published on:

విద్యార్థులను కూలీలుగా మార్చేసిన ఉపాధ్యాయులు

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: విద్యా బుద్ధులు నెర్పిం చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. వారు ఏదైనా తప్పు చేస్తే.. సరిదిద్దాల్సిన బాధ్యత వారిదే. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులకు మార్గదర్శకుడు గురువు. సమాజానికి అవసర మయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది పోయి.. కూలీలు గా వాడుకుంటున్నారు. చదువు ఇతర వాటికి నేర్చుకోవాల్సి న విద్యార్థులతో చెట్టు కొమ్మలను తొలిగించడం.. ఇతర పనులు చేయించిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. విద్యార్థుల చేత బిల్డింగ్ పైకి ఎక్కించి, చెట్టు కొమ్మలను నరికి వేయడం, సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన ములుగు జిల్లాలో కన్నాయిగూడెం మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల బాయ్స్ హాస్టల్లో చోటు చేసుకుంది. కన్నా యిగూడెం మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను పనిమనుషులుగా చేస్తున్నారు ప్రతి పనికి విద్యార్థులను పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తున్నారు బిల్లింగ్ పైన ఉన్న చెట్లను తొలగించి ఎందుకు గొడ్డలితో కొమ్మలు నరికి వేస్తున్నారు ఈ పాఠశాలలో ఏ పని ఉన్న విద్యార్థులు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నట్టు విద్యార్థులు చెప్తున్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న ఈ పనికి గ్రామస్తులు ఆగ్రహం చేస్తున్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.వెంటనే సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తు బాటలు వేసే విధంగా ఆ పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now