తెదేపా నేత సూరిబాబు 21 వ వర్ధంతి
– ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అభిమానులు, బంధువులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ ఆత్మకూరి సూర్యప్రకాశరావు సూరిబాబు 21 వర్ధంతి ని వెంకటాపురంలో ఆయన అభిమానులు బంధువులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంకటాపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న స్వర్గీయ సూరి బాబు శిలా విగ్రహానికి పలువురు ప్రముఖులు సోమవారం ఉదయం పూలమాలలు వేసి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు సూరిబాబు చేసిన సేవలను కొనియాడారు. ఆయన సోదరులు ఆత్మకూరి పట్టాభి , నరసింహమూర్తి ,ఇంకా పలువురు అభిమానులు, బంధువులు, గ్రామ ప్రముఖులు స్వర్గీయ సూరిబాబు విగ్రహానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు.