ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే వ్యాఖ్యలను తన్నీరు హరీష్ రావు మానుకోవాలి

ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే వ్యాఖ్యలను తన్నీరు హరీష్ రావు మానుకోవాలి

– ఎస్ టి యు ములుగు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శిరుప సతీష్ కుమార్, ఏళ్ల మధుసూదన్

ములుగు, తెలంగాణ జ్యోతి : ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే వ్యాఖ్యలను తన్నీరు హరీష్ రావు మానుకోవాలని ఎస్ టి యు ములుగు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శిరుప సతీష్ కుమార్, ఏళ్ల మధుసూదన్ లు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము కోసం అహర్నిశలు కృషిచేసిన ఉపా ధ్యాయ, ఉద్యోగ వర్గాలను నీచంగా చూసి అనేక రకాలుగా అవమానించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమస్య లను పరిష్కరించకుండా కొత్త కొత్త సమస్యలను సృష్టించడమే పరమావధిగా తన్నీరు హరీష్ రావు పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను సమాజంలో పగడ్బందీగా అమలు చేసేది ఉపాధ్యాయ, ఉద్యోగులే అన్న విషయాన్ని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా మళ్లీ ప్రజలలో భాగమైన ఉపాధ్యాయ, ఉద్యోగులను ప్రజల నుంచి వేరు చేసే విధంగా కుట్రలు పన్నుతూ ప్రజలను ఉపాధ్యాయ, ఉద్యోగులపై రెచ్చగొట్టే విధంగా తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను STU ములుగు జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ పార్టీకి చెందిన నాయకులకు చెందిన సాగులో లేని భూములకు కూడా రైతుబంధు డబ్బులను అక్రమంగా దారి మళ్లించిన నాయకులు ఎంత మంది ఉద్యోగులు ఏసీలలో కూర్చొని పనిచేస్తున్నారు అనే విషయం తెలియకుండా పది సంవత్సరాలు పరిపాలన చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తీసుకోనంత వేతనాలను ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో తమ ఇష్టానుసారంగా పెంచుకొని కేవలం ఉపాధ్యాయ, ఉద్యోగులు మాత్రమే వేతనాలు పెంచినట్టు దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఉద్యోగుల పట్ల కక్ష పెంచే విధంగా వ్యవహరించి ప్రస్తుతం ఫలితాన్ని అనుభవించుతున్నారన్నారు. ఇప్పటికైనా తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఉపాధ్యాయ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.