తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలో ఘోరం

Written by telangana jyothi

Published on:

తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలో ఘోరం

– అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

– భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని పక్కింటి మహిళతో గొడవ

– మహిళ దాడితోనే తన తల్లి చనిపోయిందని కొడుకు ఆరోపణ?

– విచారణ చేపట్టిన పోలీసులు 

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : గొత్తికోయ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధి లోని తక్కళ్లపాడు గొత్తికోయ గూడెంలో గురువారం ఈ సంఘ టన జరిగింది. గ్రామస్థులు, మృతురాలి కుమారులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామ పరిధిలోని తకళ్లపాడు గొత్తికోయ గూడానికి చెందిన కోరం మంగమ్మ (30) మంగయ్యలు భార్యాభర్తలు. భర్త మంగయ్య తో గూడెంలోని కమల అనే మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో బుధవారం గొడవపెట్టుకుంది. ఇద్దరి మధ్య మాటమాట పెరిగడంతో కమల మంగమ్మను వెదురు బొంగు కర్రతో కొట్టింది. తీవ్ర గాయాలపాలైన మంగమ్మ అస్వస్థతకు గురైంది. గురువారం ఉదయం తనకు అంబలి కావాలని భర్త మంగయ్యను మంగమ్మ కోరింది. అంబలి తెచ్చేలోపే ఒక్కసారిగి కిందపడిపోయిన మంగమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. అయితే తన తల్లి మంగమ్మ మృతికి పక్కింటి కమలనే కారణమని, కర్రతో దాడి చేయడం తోనే మరణించిందని కుమారుడు మహేష్ తాడ్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కమలను అదు పులోకి తీసుకొని మంగమ్మ మృతికి గల కారణాలపై విచా రణ చేపట్టారు.

Leave a comment