తపాల శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
– మంథని డివిజన్ ఇన్ స్పెక్టర్ సయ్యద్ అజారుద్దీన్
కాటారం,తెలంగాణజ్యోతి ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వ ఆధీనం లో గల తపాలా శాఖ సేవలను గ్రామీణ మారూమూల ప్రాంత పేద ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని మంథని డివిజ న్ పోస్టల్ శాఖ ఇన్ స్పెక్టర్ సయ్యద్ అజారుద్దీన్ కోరారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరపల్లి గ్రామం పంచాయతీలో ఇల్లిళ్ళు తిరుగుతూ తపాలా శాఖ నిర్వహిస్తున్న సేవింగ్ ఖాతాలు, డిపాజిట్ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, వినియోగించుకోవాలని కోరా రు. తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు ఆర్జించి పెట్టగలిగే పోస్టల్ శాఖ పథకాలను పల్లె ప్రాంతాల్లోని ప్రజానీకం సద్విని యోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. బేటి బచావో బేటి పడావో అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఆడపిల్లలు కలిగిన కుటుంబా లకు అమృత భాండాగారం అని వివరించారు. అధిక వడ్డీతో కూడిన చక్రవడ్డీ లభిస్తుందని వివరించారు. అలాగే టాటా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న జనరల్ ఇన్సూరెన్స్ పాల సీ అద్భుతంగా ఉపయోగపడుతుందని అన్నారు.ఒక వ్యక్తి 65 సంవత్సరాలు వయసున్న వ్యక్తి 750రూ. చెల్లించి పాలసీ తీసుకున్న ఎడల ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎడల 15 లక్షల వరకు బీమా చెల్లించబడుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమాలలో పోస్టల్ శాఖ సిబ్బంది కుడుదుల కిష్టయ్య, తుల్సేగారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.