కూలిపోయిన ఇంటిని పరిశీలించిన తహసిల్దార్
– ఆర్దిక సహాయం కై ఐ.టి.డి.ఏ పి.ఓ కు నివేదిక
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బర్ల గూడెం పంచా యతీ చిరుతపల్లి గ్రామంలో అట్టం కృష్ణమూర్తి అనే ఆదివాసి కుటుంబానికి చెందిన పూరిళ్ళు భారీ వర్షాలకు, గాలి దుమా రాలకు కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న వెంకటా పురం తహసిల్దార్ లక్ష్మీరాజయ్య సిబ్బంది గురువారం చిరు తపల్లి గ్రామంలోని కూలిపోయిన ఇంటిని సందర్శించి, బాదిత కుటుంభం నుండీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలి పోయిన ఇంటికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం కోసం, ఐటిడిఏ పి .ఓ కు నివేదిక పంపించనున్నట్లు తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య మీడియాకు తెలిపారు.