తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ గా స్వరూప
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా విభాగం కన్వీనర్ గా కాటారం మండలం శంకరంపల్లి గ్రామా నికి చెందిన గడ్డం స్వరూప నియమితులయ్యారు.రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గడ్డం సుధాకర్, ఉత్తర తెలంగాణ మహిళా విభాగం కన్వీనర్ వైద్యుల రజిత రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కుంట్ల ఉప్పలయ్య స్వరూప ను జిల్లా మహిళా విభాగం కన్వీనర్ గా నియమించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ ఉద్యమ కళాకారులు ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భం గా పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించి వారందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా స్వరూప కోరారు.