మావోయిస్టు పార్టీ దళసభ్యుడి లొంగుబాటు
– వివరాలు వెల్లడించిన ఇన్చార్జి ఓఎస్డీ రవీందర్
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ సభ్యుడు లేఖం లచ్చు అలియాస్ అశోక్ ములుగు పోలీసుల ఎదుట లొంగి పోయాడు. మంగళవారం ములుగులో డీఎస్పీ, ఇన్చార్జి ఓఎస్డీ ఎన్.రవీందర్ అందుకు సంబంధించిన వివరాలు వెల్ల డించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ర్టం బీజాపూర్ జిల్లా టెర్రం పోలీస్ స్టేషన్ పరిదిలోని పెద్ద గెలూర్ కు చెందిన లచ్చు ఏటూరు నాగారం మహదేవ్ పూర్ ఏరియా కమిటీ సభ్యుడు నలమారి అశోక్ తో కలిసి 2022లో నిషేదిత మావోయిస్టు పార్టీలో చేరి 2023 జనవరి వరకు మిలీషియా సభ్యునిగా పనిచేశాడు. అనంతరం రెండేళ్లపాటు పార్టీ సభ్యునిగా పనిచేశాడు. 2024 ఏప్రిల్ లో వెంకటాపురం పరిధిలోని కర్రిగుట్టపై జరిగిన ఎన్ కౌంటర్ లో కొందరు చనిపోగా లచ్చు తప్పించుకున్నాడు. కర్రిగుట్ట అటవీ ప్రాంత పరిధిలో పలు ప్రెషర్ మైన్స్ అమర్చిన సంఘటనల్లో నిందితునిగా ఉన్నాడు. కాగా, కొన్నిరోజులుగా మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి ప్రశాంతమైన జీవనా న్ని గడిపేందుకు నిర్ణయించుకునన లచ్చు మంగళవారం ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జనాలతో, కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారు పోలీసులకు లొంగిపోవాలని ఇన్చార్జి ఓఎస్డీ రవీందర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆప రేషన్స్ సంతోష్ పాల్గొన్నారు.