కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని కలిసిన కొత్త సురేందర్

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని కలిసిన కొత్త సురేందర్

– ఎస్టీ మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనందుకు అభినందనలు

ములుగు : భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పార్టీ ఎస్టీ మోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ ఆదివారం ప్రజాహిత యాత్రలో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ర్ట బాధ్యతలు స్వీకరించిన సురేందర్ ను బండి సంజయ్ శాలువాతో సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ముచ్చటగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని, అందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. భారత దేశాన్ని ప్రపంచానికి దిక్సూచిగా మలిచిన దృఢమైన నాయకుడు మోదీ అని స్పష్టం చేశారు. 2014కు ముందు భారత్, 2024లో భారత్ ఏవిధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యంగా యువత మరోసారి మోడీ అంటూ ముందుకు కదులుతున్నారని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను కరోనా కాటువేసినా అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు. బండి సంజయ్ని కలిసిన వారిలో బిజెవైయం రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్, జిల్లా నాయకులు శివ , ప్రవీణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.