గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొత్త సురేందర్
ములుగు, తెలంగాణ జ్యోతి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జె.కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొత్త సురేందర్ కు చోటు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొత్త సురేందర్ మాట్లాడుతూ ప్రాథమిక విద్యాభ్యాసంలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎదిగి ఏబీవీపీ, విద్యార్థి పరిషత్ లో పనిచేసి బిటెక్ లో విద్యార్థి పరిషత్ కాలేజీ ఇన్చార్జిగా పనిచేసి ములుగు యువమోర్చా మండల అధ్యక్షులుగా, బిజెపి మండల అధికార ప్రతినిధిగా, నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లా యువ మోర్చా అధ్య క్షులుగా పనిచేసి, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ప్పుడు మొదటి ప్రజా సంగ్రామ పాదయాత్రలో పాల్గొని బండి సంజయ్ చేతుల మీదుగా ప్రజా సంఘ్రమయాత్ర బెస్ట్ అవార్డు పొందడం జరిగింది. ములుగు జిల్లాలో యువమోర్చా ఆధ్వ ర్యంలో రాష్ట్ర ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టి ములుగు జిల్లాలో బిజెపిని ముందుకు తీసుకవెళ్లడంలో తనవంతు కృషి చేశానన్నారు.