SSC పరీక్ష ఫలితాలలో సన్ రైజర్స్ హై స్కూల్ ప్రభంజనం 

SSC పరీక్ష ఫలితాలలో సన్ రైజర్స్ హై స్కూల్ ప్రభంజనం 

ములుగు, తెలంగాణ జ్యోతి :  పదో తరగతి పరీక్ష ఫలితా లను మంగళవారం ఎస్ఎస్సి బోర్డు విడుదల చేయగా ఆ ఫలితాలలోములుగులోని సన్ రైజర్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పరీక్ష ఫలితాలలో సముద్రాల భాను తేజ 10/10 జీపీఏ, బక్క జస్వంత్ 9.8/10, జాటోత్ అజయ్ 9.7/10 జిపిఏ,9.5/10 జిపిఏ కొనుకటి అరవింద్, శ్యామల సిరి చందన, గజ్జి దినేష్, కె. అభినవ్ నలుగురు విద్యార్థులు,9.3/10 జిపిఏ ఇద్దరికీ,9.2/10 జిపిఏ ముగ్గురు విద్యార్థులు సాధించారు. వీరితోపాటు మిగతా విద్యార్థులు 100% ఉత్తీర్ణత పొందారు.10/10,9.8/10 సాధించిన విద్యార్థులను అభినందించి వారి తల్లిదండ్రులతో పాటుగా వారిని పాఠశాల కరస్పాండెంట్ పెట్టెం రాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బలుగూరి జనార్ధన్, లతో పాటు ఉపాధ్యాయనీ ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.