సబ్సిడీపై జీలుగు, జనుము విత్తనాలు విక్రయానికి సిద్ధం
– మండల వ్యవసాయ అధికారి నవీన్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పచ్చి రొట్ట ఎరువుల పెంపకానికి రాయితీపై విక్రయించేందుకు జీలుగ, జనుము విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ఆసక్తి గల రైతులు పొందాలని మండల వ్యవసాయ అధికారి నవీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగ విత్త నాలు 50 కింటాలు, జనుములు 8 క్వింటాలు మంజూరు అయ్యాయని తెలిపారు. 30 కిలోల జీలుగ బస్తా 2,137, అలాగే జనుముల 40 కిలోలు 2,510. రూపాయలు వంతున పొందవచ్చన్నారు. ఆయా విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో విత్తనాలు కావలసిన రైతులు, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు నకళ్ళతో సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలని కోరారు. భూసారం పెరిగి, పంట దిగుబడులు పెరుగుతాయని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నవీన్ రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు.