కాళేశ్వరాలయంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి పూజ
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం లో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం లో అనుబంద దేవాలయమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కృష్ణ మూర్తి వారి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆల యంలొ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఏ.మారుతి, సూపరింటెంట్ బుర్రి శ్రీని వాస్ మరియు కాళేశ్వరం గ్రామస్తులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది, పాల్గొన్నారు.