పసి బాలుడి వైద్యానికి తస్లీమా చేయూత

పసి బాలుడి వైద్యానికి తస్లీమా చేయూత

ములుగు/గోవిందరావు పేట, తెలంగాణ జ్యోతి : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసి బాలుడి వైద్యానికి చేయూతనందించిన మహబూ బాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ దాతృత్వం చాటుకున్నారు. ఇటీవలే పలు పత్రికలలో వచ్చిన దాతలు ఆదుకోండి ప్లీజ్ అనే శీర్షికకు స్పందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పసి బాలుడి వైద్యానికి 10 వేల రూపాయలు సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల లోకి వెళితే… ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన వెల్పుగొండ నాగరాజు – మౌనిక దంపతుల కుమారుడు లక్ష్మణ్ ఆడుకుంటూ క్రింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది, మెదడులో రక్తం గడ్డ కట్టిందని ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. శనివారం హన్మకొండలోని డాల్ఫిన్ ఆస్పత్రికి వెళ్ళిన తస్లీమా బాబు తల్లిదండ్రులను ఓదార్చి, బాబు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి, మంచి వైద్యం అందించాలని కోరారు. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం అతడి తల్లిదండ్రులకు 10 వేల రూపాయలు సాయం అందించి తస్లీమా దాతృత్వం చాటుకున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment